కవాతుకు కదం కలపండి

‘తెలంగాణ మార్చ్‌’ విజయవంతానికి తరలిరండి
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కేకేతో
టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం సమాలోచనలు !ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోదండరాం కేకేను కవాతుకు మద్దతు తెలుపాలని కోరడానికే కలిసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా కోదండరాం కేకేతో తెలంగాణ మార్చ్‌ విజయవంతానికి కృషి చేయాలని కోరినట్లు సమాచారం. అదే విధంగా కేకేతో ఆయన జరిపిన సమాలోచనల్లో భాగంగా స్వపక్ష సభ్యులే ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తే, తెలంగాణ ఆకాంక్ష బలంగా ఉన్నట్లు యూపీఏ గుర్తించే అవకాశముందని వివరించినట్లు తెలిసింది. ఫలితంగా యూపీఏ మిత్రపక్షాలు ఒత్తిడి పెంచితే కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా తెలంగాణ ఏర్పాటుపై సానుకూల ప్రకటన చేసే అవకాశముందని కోదండారాం కేకేకు వివరించారు. అంతేకాకుండా, తెలంగాణవాదాన్ని కేకే బలంగా వినిపిస్తున్నారని, కాంగ్రెస్‌లో ముఖ్య నాయకుడైన కేకే బలంగా గళమెత్తితే ఉద్యమానికి మరింత శక్తి వస్తుందని జేఏసీ భావిస్తోంది. అయితే, ఈ భేటీలో కేకే కూడా జేఏసీ ప్రస్తావనపై సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఇంతకు ముందు తాను ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడానని, ఇక ముందు తెలంగాణ ఉద్యమంలో ముందుంటానని కేకే కోదండరాంతో స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.