కవాతును అడ్డుకోవడం అనైతికం:నాగం
హైదరాబాద్: తెలంగాణ కవాతుకు పోలీసులు అడ్డుకోవడం అనైతికమని నాగర్ ర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్థన్‌రెడ్డి అన్నారు. కవాతులో భాగంగా నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటుచేసిన సభలో నాగం మాట్లాడుతూ ఏమాత్రం ప్రాణ నష్టం జరిగినా ప్రభుత్వం కూలుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో అప్రకటిత రాష్ట్రపతిపాలన కొనసాగుతోందని ఆయన మండిపడ్డారు.



