కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ జూనియర్ కళాశాల అదనపు తరగతి గదులను ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి.
తాండూర్ (మంచిర్యాల ) సెప్టెంబర్ 23 జనంసాక్షి :
తాండూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కాలేజ్ అదనపు తరగతి గదులను శుక్రవారం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిథిలుగా హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో 1 కోటి 35 లక్షల రూపాయల సమగ్ర శిక్ష నిధులతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ జూనియర్ కళాశాల అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టి విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కే సి ఆర్ విద్యను ఒక యజ్ఞం గా తీసుకోని విద్య శాఖ ను బలోపేతం చేయడానికి మన బస్తి మన బడి , మన ఊరు మన బడి లాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారని, దానిలో అందరు భాగస్వాములు కావాలని కోరారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ హైదరాబాద్ నుండి దాదాపు 400 కి మీ దూరం లో ఉన్న తాండూర్ వెనకబడిన ప్రాంతమని, ప్రాణహిత దాటితే మహా రాష్ట్ర సరిహద్దు మరియు మధ్య ప్రదేశ్ సరిహద్దు లని తెలియజేసారు వెనక బడిన ప్రాంతమని ఎక్కువగా షెడ్యూల్ కులాల వారు షెడ్యూల్ తెగలవారు కలిగిన ప్రాంతమని తెలిజేశారు. ఈ కార్యక్రమం లో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత , ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర సరోత్తం రెడ్డి , తెలంగాణ రాష్ట్ర టీఎస్ఈడబ్ల్యూఐడిసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి , మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతీ హోళీకెరీ, బెల్లంపల్లి ఆర్డీవో శ్యామలదేవి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ ప్రవీణ్ కుమార్ , ఎంపీపీ ప్రణయ్ కుమార్ , జడ్పీటీసీ బానయ్య , సింగిల్ విండో ఛైర్మన్ దత్తుముర్తి , మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆరెస్, టీఆరెస్వై, టీఆరెస్వి నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు …