కాంగ్రెస్‌ను నమ్మితే అథోగతే !

 
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ధ్వజం
హైదరాబాద్‌, నవంబర్‌ 11 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ను నమ్మితే అది ఆత్మహత్య సదృశ్యమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. కేసీఆర్‌ కేంద్రాన్ని ఇంకా నమ్ముతున్నారని కేంద్ర ప్రభుత్వం ఓ శాడిస్టని తెలంగాణ విషయంలో దాని అవతారాన్ని ప్రదర్శిస్తోందని విమర్శించారు. అన్ని పార్టీలకు తెలంగాణ విషయం నాన్చడం సమస్యగా మారిందని తెలంగాణ కోసం ఏర్పాటైన టీఆర్‌ఎస్‌ తమ బాధలను మింగలేక, కక్కలేక మధన పడుతుందన్నారు. పార్లమెంట్‌ ముందో, తరువాత అంటూ షిండే ప్రకటనలు తెలంగాణ ప్రజల ఓపికను పరిక్షించేలా ఉన్నాయన్నారు. తెలంగాణకోసం పడిగాపులు పడుతున్నా కేసీఆర్‌ను కేంద్రం కనికరించటంలేదని, డిసెంబర్‌9న చిలుకపలుకులు పలికిన చిదంబరం తరువాత మాట మార్చి తెలంగాణ కోసం పోరాడే పార్టీలను, ప్రజలను మోసం చేశారన్నారు. ఓ బాధ్యతకల్గినవ్యక్తి తెలంగాణ ఎక్కడుందంటే.? మరో ఆయన తెలంగాణ ఇచ్చేది మేమే తెచ్చేది మేమే అంటూ తెలంగాణ ప్రజల విశ్వాసాలతో చెలగాటమడుతున్నారు. తెలంగాణ ఇస్తామని మోసం చేసిన డిసెంబర్‌ 9వ తేదీన విద్రోహదినంగా గుర్తించి నిరసన చేసేందుకు పిలుపునిసున్నట్తు తెలిపారు. కాంగ్రెస్‌ను ఇంకా నమ్మితే కేసీఆర్‌ భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు