కాంగ్రెస్‌లో వైకాపా విలీనం: కేటీఆర్‌

హైదరాబాద్‌: భవిష్యత్తులో కాగ్రెస్‌లో వైకాపా విలీనం కావడం ఖాయమని తెరాస నేత కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌, వైకాపాలు దొంగ నాటకాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయని కేటీఆర్‌ ఆరోపించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌కు మద్దతునివ్వాలని వైకాపి నిర్ణయించడంతో ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోందని అయన విమర్శించారు. జగన్‌కు బెయిల్‌, ప్రణబ్‌కు ఓటు ఒప్పందం ఢిల్లీ పర్యటనలో వైఎస్‌ విజయమ్మ కురర్చుకున్నట్టుగా అవగతమైందని అయన అన్నారు.