కాంగ్రెస్‌ సర్కారుకు 72 గంటల గడువు

కోల్‌కతా: యూపీఏ భాగస్వామ్య పక్షం తృణమూల్‌ కాంగ్రెస్‌ సర్కారుకు 72 గంటల గడువు విధించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలోనూ, డీజిల్‌ ధర పెంపు విషయంలోనూ వెనక్కి తగ్గకపోతే త్వరలో జరిగే పార్టీ పార్లమెంటరీ సమావేశంలో కఠిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తృణమూల్‌ నేత, కేంద్ర రైల్యే మంత్రి ముకల్‌ రాయ్‌ అన్నారు.