కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తాం.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ పి.బస్వరాజ్.
తాండూరు అగస్టు 24(జనంసాక్షి)రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుం దని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. మాజీ కౌన్సిలర్ పి.బస్వరాజ్ పేర్కొన్నారు.ఈ సందర్భం గా తననివాసంలో జనంసాక్షి ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో నే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందని గుర్తు చేశారు.సోనియమ్మ రాహుల్ గాంధీ నాయకత్వంలో తాండూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్ మహారాజ్ ఆధ్వర్యంలో తాండూర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొ స్తామని వివరించారు.తాండూరు నియోజకవర్గం లో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే వర్గపోరుతో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఎద్దేవా చేశారు.
ఇప్పటికి కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధే కనిపిస్తుందని అన్నారు. గ్రామ గ్రామాన వార్డుల లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తున్నామ ని రమేష్ మహారాజ్ నాయకత్వంలో తాండూరు లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని ఆశాభా వం వ్యక్తం చేశారు.