కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే తరిమి కొడతాం – ఝాన్సీ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే తరిమి కొడతాం – ఝాన్సీ రెడ్డి
దేవరుప్పుల, అక్టోబర్ 06(జనం సాక్షి): పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఝాన్సీ రెడ్డి నిర్వహిస్తున్న గదపగడపకు కాంగ్రెస్ – పల్లె పల్లెకు ఝాన్సమ్మా సంకల్పయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బిఆర్ఎస్ ,కాంగ్రెస్ కార్యకర్తల మధ్య మాట మాట పెరిగి ఘర్షణకు దారి తీసిన ఘటన గురువారం రాత్రి నిర్మాలలో గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని సింగారాజుపల్లి గ్రామ కూసంత దూరంలో ఉన్న రామారాజుపల్లి, నిర్మాల గ్రామంలో ఝాన్సీ రెడ్డి నిర్వహిస్తున్న గడపగడపకు కాంగ్రెస్ – పల్లె పల్లె కు ఝాన్సమ్మ సంకల్ప యాత్రలో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ములుగు జిల్లా సీతక్క రామారాజుపల్లి గ్రామంలో పర్యటించారు.ప్రతి ఇంటింటికి తిరిగిన సీతక్క, ఝాన్సీ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన ఆరు గ్యారెంటీ పథకాల గురించి తెలియపరచారు.ఈ పథకాలకు ఆకర్షితులైన కొందరు గ్రామస్థులు సీతక్క ,ఝాన్సీ ల అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.తదనంతరం సీతక్కకు అత్యవసర పనులు ఉండడంతో ములుగుకు వెళ్లిపోయారు.సాయంత్రం ఆరు గంటల నుంచి నిర్మాల గ్రామంలో ఝాన్సమ్మ సంకల్ప యాత్రలో పర్యటిచిన ఝాన్సీ రెడ్డి రాత్రి ఏడున్నర గంటల సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశంలో దేవరుప్పుల మండల కాంగ్రెస్ అధ్యక్షులు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చెయ్యబోయే పనుల గురించి మాట్లాడుతుండగా సభ సమావేశం లో కరెంటు పోవడంతో ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఊర్లో కరెంటు ఉంటే సమావేశం వద్ద కరెంటు తీసేశారని ,కరెంట్ తీసి వేస్తే కాంగ్రెస్ సమావేశం ఆగిపోతుందనుకొని బి ఆర్ ఎస్ నాయకులు కరెంటు తీసివేశారనీ , బిఆర్ఎస్ కెసీఆర్ ఇచ్చే 24 గంటల కరెంటు ,ఎర్రబెల్లి చేసే పని తీరు ఇదేనని పెద్ది కృష్ణమూర్తి గౌడ్ వ్యాఖ్యానించిన తరుణంలో అక్కడే ఉన్న బిఆర్ఎస్ కార్యకర్తలు ఎర్రబెల్లి చేసే పనులు,అభివృధ్ధి మీకు కనిపించడం లేదా ఎర్రబెల్లి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు సభ దిగు అంటూ అగ్రహించుకుంటు సమావేశం వద్దకు వచ్చిన బిఆర్ఎస్ కార్యకర్తను కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్క సారిగా దాడి చెయ్యడంతో పాటు కూర్చిలతో ,కర్రలతో చితకబాదారు.సభ సమావేశం వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది.ఈ లాంటి ఎర్రబెల్లి చేసే చంచాగిరికి భయపడే వారు ఎవ్వరూ లేరని పాలకుర్తి పోరాటాల గడ్డ అని ,చాకలి ఐలమ్మ రోకలి కర్రతో ప్రభుత్వాన్ని ,ఎదురుతిరిగి రజాకార్లను తరిమికొట్టిన గడ్డ అని, ఇది కాంగ్రెస్ అడ్డ అని ఝాన్సీ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ నాయకులు కానీ,కార్యకర్తలు కానీ మా కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే రోకలి కర్రలతో తిరగబడాలని కార్యకర్తలు సూచిస్తూ ఝాన్సీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సమయానికి స్థానిక పోలీసులు రావడంతో గొడవ సద్దుమణిగింది.తదనంతరం ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం తో మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలతో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,రైతు భరోసా పథకంతో ప్రతి ఏటా రైతులకు,కౌలు రైతులకు ఎకరానికి 15000 రూపాయలు ఇస్తామని ,అలాగే వ్యవసాయ కూలీలకు 12 వేల రూపాయలు తో పాటు వరి పంటకు 500 రూపాయలు బోనస్ గా ఇస్తామని ,గృహ జ్యోతి పథకంతో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పాటు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం లేదా ఐదు లక్షల రూపాయలు ఇస్తామని అలాగే ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయిస్తామని, యువ వికాసం పథకం కింద విద్యార్థులకు ఐదు లక్షల విద్య భరోసా కార్డు ,పిల్లల బాగుపడడం కోసం ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ కట్టిస్తామని, చేయూత కార్మికులకు నెలకు 4 వేల రూపాయల పింఛన్లు,రాజీవ్ ఆరోగ్య శ్రీ భీమా ద్వారా 10లక్షల రూపాయలు అందజేస్తామని అన్నారు. ఇదే కాకుండా పాలకుర్తి లో నన్ను గెలిపిస్తే ఎమ్మెల్యే కు నెల వారీగా వచ్చే లక్ష రూపాయల జీతం ప్రజల మీదే ఖర్చు పెడతానని , నేను ప్రజలకు సేవ చెయ్యడానికి వచ్చేనే కానీ ఇక్కడ సంపాదించడానికి రాలేదని ,రాజకీయంతో ఎలాంటి సంబంధం లేనప్పుడే తొర్రూరు లో నా వంతు సహాయంగా అభివృద్ధి చేస్తున్నానని చెప్పుకొచ్చారు.ఎర్రబెల్లిని ఓడించి నేను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని ఈ ఒక్కసారి కాంగ్రెస్ని ఓటేసి గెలిపించాలని గ్రామస్తులను కోరారు.ఈ కార్యక్రమంలో పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దారావత్ రాజేష్ నాయక్, దేవరుప్పుల మండల కాంగ్రెస్ అధ్యక్షులు పెద్ది కృష్ణమూర్తి గౌడ్, కొడకండ్ల మండల కాంగ్రెస్ అధ్యక్షులు దారావత్ సురేష్ నాయక్,పెద్దవంగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బానోతు రవి నాయక్, మొండ్రాయి గిర్ని తండ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధీర్ నాయక్ ,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.