కాంట్రాక్టు,ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వెంటనే జీతాలు విడుదల చేయాలి
..జాజుల లింగంగౌడ్
మిర్యాలగూడ, జనం సాక్షి
మూడు,నాలుగు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్న కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఫ్లకార్డులతో నిరసన తెలిపారు.ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత మూడు,నాలుగు నెలలుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వకపోవడంతో వారు హరిగోస పడుతున్నారని అన్నారు.ఇచ్చే కొద్ధో,గోబ్బో జీతమైనా ప్రభుత్వం సక్రమంగా ఇవ్వడం లేదన్నారు.చాలీచాలని జీతాలతో,రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వారు ప్రజలకు సేవలందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారిపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు.సమాన పనికి సమాన వేతనం అన్న సుప్రీంకోర్టు ఆదేశాలను చాలా డిపార్ట్మెంట్ లలో అమలు చేయడంలేదు.మన రాష్ట్రంలో అతి పెద్ద పండుగ దసరానేనని ఆ పండుగ పూట వారిని పస్తులుంచడం భావ్యం కాదన్నారు.వెంటనే జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నo.ఈ కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ ఇంచార్జి గుండెబోయీన నాగేశ్వరరావు యాదవ్,బంటు వెంకటేశ్వర్లు,ఫరూక్,సుధాకర్,సతీశ్,మల్లిఖార్జున,ఓం ప్రకాశ్,రాకేశ్,రాంబాబు తదితరులుపాల్గొన్నారు