కార్మికులందరికీ సమాన వేతనం
కడప, జూలై 10 : జిల్లాలో కార్మికుల చట్టం ప్రకారం కార్మికులతో సమానంగా బాల కార్మికులకు కూడా వేతనాలు చెల్లించాలని కార్మిక సంక్షేమ శాఖ డిప్యూటీ కమిషనర్ రాజేంద్రన్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ నెల మొదటి నుంచి ఈ చట్టం అమలులోకి వచ్చిందని చెప్పారు. మోటార్ వాహనాలు, బీడీ పరిశ్రమలు, దుకాణాలు, ఫ్యాక్టరీలలో కార్మికులుగా పని చేస్తున్న వారిందికి ఈ చట్టం వర్త్తిస్తోందని అన్నారు. 14 ఏళ్లు పూర్తికాని వారిని పనుల్లో పెట్టుకుని యాజమ్యానాలు అందరూ చట్ట రీత్యా శిక్షార్హులని అన్నారు. అలా పట్టుబడినవారు ఒక సంవత్సరంతోపాటు 20 వేలు పరిహరాన్ని చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలనకు యాజమ్యానాలు సహకరించాలని చెప్పారు.