కాలం మారుతోంది..వానాకాలంలోనూ ఎండలే
రుతుపవనాలు వచ్చినా తగ్గని భానుడి ప్రతాపం
హైదరాబాద్,ఆగస్ట్21(జనంసాక్షి): కాలం మారుతోంది. వాతావరణ ప్రతికూల పరిస్తితులు గోచరిస్తున్నాయి.
పర్వారణ విధ్వంసానికి నిదర్శనంగా ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కానవస్తున్నాయి. నైరుతి ప్రవేశించిన తొలినాళ్లలో గట్టి వానలు అక్కడక్కడా పడ్డాయి. వాగులు వంకలు పొంగాయి. నిర్మల్ లాంటి పట్టణాలు నీటమునిగాయి. ఈనెల మొదటి వారంలో వాతావరణం చల్లబడినట్లు కనిపించినా మళ్లీ భానుడు ప్రతాపం చూపుతున్నాడు. నైరుతి రుతు పవనాలు తొందరగా వచ్చినా ఫలితం కనిపించలేదు. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం జూన్ ఆరంభం వేడి ప్రభావంతక్కువగానే ఉంది. అంతేకాకుండాకొద్దో గొప్పో చినుకులూ పడ్డాయి. దీంతో రైతులు ఖరీఫ్ పనులనుప్రారంభించారు. ఉన్నట్లుండి నాలుగైదు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగి బెంబేలెత్తిస్తున్నాయి. రాయల సీమ జిల్లాల్లో కూడా వేడి కనిపిస్తోంది. వారం క్రితం వరకు తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు మళ్లీ చినుకులుల పడడంతో తగ్గినట్లే తగ్గినా వాతావరణంలో మాత్రం వేడి తగ్గడం లేదు. ఉక్కపోతా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఐదారు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగడంతో పగలంతా వేడిగా ఉంటోంది. తక్కువ రోజుల వ్యవధిలో ఎక్కువ డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలకు కూడా అర్థం కావడం లేదు. నైరుతి రుతుపవనాలు కూడా రాష్ట్రంపై పెద్దగా ప్రభావం చూపడం లేదని అంచనా. రుతుపవనాలు వచ్చినా అల్పపీడనం బలంగా తోడైతేనే వర్షాలు పడే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేవరకు పరిస్థితి ఇలానే కొనసాగుతుందంటున్నారు. ఇందుకు మరో మూడు, నాలుగు రోజులు పట్టవచ్చు. అంత వరకు ఉష్ణోగ్రతలు ఇలానే కొనసాగే అవకాశముంది. ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరంగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభా వంతో జూన్ మొదటి నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ఎండల నుంచి ప్రజలు ఉపశమనం పొందారు. ఈ ప్రభావం ఎక్కువ రోజులు కనిపించలేదు. మరో రెండు, మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇలానే కొనసాగే అవకాశం ఉంది.