కిరణ్‌పై అసదుద్దీన్‌ ఫైర్‌

హైదరాబాద్‌,  నవంబర్‌ 14, (జనంసాక్షి):

ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వంపై మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు హైదరాబాద్‌ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్‌ ఓవైసీ బుధవారం మరోసారి నిప్పులు చెరిగారు తమకు కాంగ్రెస్‌ పార్టీతో 14 ఏళ్ల వనవాసం పూర్తమిందని ఆరోపించారు నాడు ప్రధాని పిని నరసింహా రావు హయాంలో ముస్లిలు ఎలా ఇబ్బందులు పడ్డారో ఇప్పుడు కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలో అలాగే ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు .కిరణ్‌ ప్రభుత్వానికి మద్దుతు ఉపసంహరణ నేపధ్యంలో అసదుద్దీన్‌ దారుస్సలేంలో 13 ముస్లిం  సంఘాల నేతలతో భేటీ అయ్యారు అనంతరం వారితో కలిసి  మీడియా సమావేశం నిర్వహించారు ప్రభుత్వ చర్యలతో పాతబస్తీ స్తంభించిందన్నారు  25 తర్వాత తామురాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రభుత్వానికి ఎందుకు మద్దుతు ఉపసంహరించామో ప్రజలకు వివరిస్తామన్నారు చార్మినార్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉందన్నారు.ఉప ముఖ్యమంత్రి ఆలయాన్ని సందర్శించడం మతి విధానానికి నిదర్శనమన్నారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకి ఒక్క ముస్లిం ఓటు కూడా పడదన్నారు ఎంఐఎం నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు యునైటెడ్‌ ముస్లిం జెఏసి ప్రకటించింది ప్రభుత్వం మతరమైన సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లుగా అర్థమవుతోందన్నారు మతసామరస్యం కాపాడలేని ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో .పెకిలించాలన్నారు.