కిరణ్‌ మోరేకు బీసీసీఐ క్షమాభిక్ష వన్‌టైమ్‌ బెనిఫిట్‌

ముంబై , జూలై 16 : భారత మాజీ వికెట్‌ కీపర్‌ కిరణ్‌ మోరే కు బీసీసీఐ క్షమాభిక్ష ప్రసాదించింది. బీసీసీఐకి వ్యతిరేకంగా గతంలో ప్రారంభమైన ఇండియన్‌ క్రికెట్‌ లీగ్‌ లో కపిల్‌ దేవ్‌ తో పాటు కిరణ్‌ మోరే కూడా కీలకపాత్ర పోషించాడు అప్పటి నుండి వీరీద్దరి పై బోర్డు నిషేదం విధించింది. అయితే ఐపిఎల్‌ తెర పైకి వచ్చిన తర్వాత ఐసిఎల్‌ కనుమరుగైంది.దీంతో కిరణ్‌ మోరే బోర్డు తో సంబంధాలు మెరుగు పరుచుకునేందుకు ప్రయత్నించాడు.
ఇదే సమయంలో మాజీ క్రికెటర్లకు బీసీసీఐ ఐపీఎల్‌ లాభాలను పంచింది. ఏడు కేటగిరిలుగా విభిజించి భారీగా నజరానాలను అందజేసింది. ఐపిఎల్‌ ఐదో సీజన్‌ ముగిసిన తర్వాత కిరణ్‌ మోరే బొర్డును క్షమాభిక్ష కోరాడు . తనకు వన్‌ టైమ్‌ బెనిఫిట్‌ అనుమతించాలని బోర్డు ను అడిగాడు . ఇవాళ జరిగిన వర్కింగ్‌ కమీటీ సమావేశంలో బీసీసీఐ దీనిపై చర్చించింది. కిరణ్‌ మోరే లేఖను పరిశీలించామని , దానికి ఆమోద ముద్ర వేసినట్లు బోర్డు ఒక పకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో మోరే కు బీసీసీఐ నుండి 60 లక్షల రూపాయల వన్‌టైమ్‌ బెనిఫిట్‌ పాటు గతంలో ఆపేసిన పెన్షన్‌ కూడా కొన సాగించనున్నారు. మరో వైపు కపిల్‌ దేవ్‌ కూడా బొర్డుతో రాజీ యత్నాలకు ఇటివలే తెరలేపాడు తాను ఐసీఎల్‌ డైరక్టర్‌ పదవికి రాజీనామా చేసినట్టు ఇటవలే కపిల్‌ ప్రకటించాడు .మరి కపిల్‌ దేవ్‌ విషయంలో బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.