కుక్కల దాడిలో 120 గొర్రెల మృత్యువాత…….

 

తుంగతుర్తి ఫిబ్రవరి 28 (జనం సాక్షి)
కుక్కల దాడిలో 120 గొర్రెలు మృతి చెందిన విషాద సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలో తూర్పు గూడెం గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకున్నది గ్రామానికి చెందిన. బాధితుడు దా యం రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గత కొద్ది సంవత్సరాలుగా గ్రామ శివారులోని తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న మామిడి తోటలో రక్షణగా ఇనుప కంచే ఏర్పాటు చేసుకొని అందులో గొర్రెల షెడ్ ఏర్పాటు చేసుకుని 300 పైగా గొర్రెలను పెంపకం చేస్తున్నాడు. రోజు మాదిరిగానే మంగళవారం సాయంత్రం గొర్రెలను షెడ్ల లో తొలి ,రాత్రి పది గంటలకు పని వారు ఉండి ఇంటికి వెళ్లి పోయారని తెలిపారు. అర్ధరాత్రి వీధి కుక్కలు గొర్రెలు చుట్టూ ఉన్న షెడ్ ఫెన్సింగ్ వైర్ కింద నుంచి మట్టిని తో డి ద్వారం చేసుకొని గొర్రెల షెడ్డులోనికి ప్రవేశించాయని అవి ఒక్కసారిగా గొర్రెలపై దాడి చేసి తమ ఇష్టాను రీతిగా 120 గొర్రెలను కరచి చంపి వాటి రక్తం త్రాగాయని తెలిపారు.. మరో 20 గొర్రెలను కరువగా తీవ్ర గాయాలు కావడంతో అవి చావు బతుకు మధ్యన కొట్టుమిట్టాడుతున్నాయని తెలిపారు. బుధవారం ఉదయం పని వారు షెడ్ లోకి వెళ్లి చూడగా గొర్రెలు చనిపోయి ఉండడం అందులో కొన్ని కుక్కలు గొర్రెల రక్తం తాగుతూ కనబడడం తో వాటిని పట్టుకోడానికి ప్రయత్నం చేశారని కానీ అవి తప్పించుకున్నట్లు తెలిపారు. సంఘటన స్థలానికి వెటర్నరీ అధికారులు చేరుకొని పరిస్థితిని సమీక్షించారుఇంత పెద్ద సంఖ్యలో గొర్రెలు చనిపోవడంతో చుట్టుపక్క గ్రామాల వాళ్ళు షెడ్ దగ్గరకు వెళ్లి కన్నీరు పెడుతున్నారు. తాను గొర్రెల మృతితో 15 లక్షల పైగా నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తనను ఆదుకోని నష్టపరిహారం చెల్లించాలని బాధితుడు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు ఇదిలా ఉండగా గత ఆదివారం రాత్రి మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన మేడిదల సోమల్లు కి చెందిన 18 గొర్రెలపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి దీంతో అతనికి రెండు లక్షల నష్టం వాటిల్లింది