కురిచేడు పోలీసు స్టేషన్‌ను పరిశీలించిన ఎస్‌పి

కురిచేడు, జూలై 18 : కురిచేడు పోలీసు స్టేషన్‌ను బుధవారం ఉదయం జిల్లా ఎస్‌పి కొల్లి రఘురాంరెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన స్టేషన్‌ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలతో స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పాలని ఆయన సిబ్బందికి సూచించారు. అనంతరం స్టేషన్‌ రికార్డులను తనిఖీ చేశారు. ఈయన వెంట దర్శి డిఎస్‌పి కెవి నాగలక్ష్మి, దర్శి సిఐ శ్రీరాం, కురిచేడు ఎస్‌ఐ ఎస్‌ సుబ్బారావు, తాళ్లూరు ఎస్‌ఐ ఎంవి కృష్ణయ్య ఉన్నారు.