-->

కూకట్ పల్లి వాసి, ముప్పిడి రాజుకు గురుస్పందన పురస్కారం 2022.

  అభినందించిన మాజి ఐ.పి.ఎస్. అధికారి డా.జె.డి. లక్ష్మినారాయణ .

హైదరాబాద్, సెప్టెంబర్ 21 :  జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ విజయవాడ సమీపంలో తాడేపల్లి కరకట్ట రోడ్డు, చిగురు ఆశ్రమంలో నిర్వహించిన 8 ఎలిమెంట్స్ ఆఫ్  వెల్నెస్  ప్రోగ్రాం  కార్యక్రమంలో తెలంగాణ గురుకుల ఆశ్రమ పాఠశాల, తి.తి.దే. తెలుగు ఉపాధ్యాయులు ముప్పిడి రాజుకు మాజీ సీనియ‌ర్  ఐ.పి.ఎస్.అధికారి డాక్టర్ జె.డి. లక్ష్మినారాయణ “స్పందనగురు పురస్కారం2022” అంద‌జేశారు. ఆంధ్ర‌ప‌దేశ్ టొబాకో ఎగ్జిక్యూటీవ్ డైరెక్టెర్  డా. అద్దంకి శ్రీధర్ బాబు, స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్  చైర్మన్ డాక్టర్ ఈదా శ్యాముల్ రెడ్డి, ఈదా అంజిరెడ్డి, పులుగు కిశోర్, డా.జి.రాజేశ్వరావు, డి.పద్మావతి, శ్రీనివాస్ గురుమూర్తి, ఎస్.ఎచ్. కులకర్ణి, ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ విశ్వనాథమ్ గారు, తెలుగు ఉపాధ్యాయులు ముప్పిడి రాజును  శాలువాతో సత్కరించి మెమొంటో, జ్ఞాపిక ప్రశంసా పత్రాన్ని అందజేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి  14 జిల్లాలకు చెందిన 100 మందికిపైగా గుర్తించిన ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా సన్మానం చేశారు. తెలంగాణ నుండి కొందరూతో పాటు, సంగారెడ్డి జిల్లా, రాపర్తి గ్రామానికి చెందిన ముప్పిడి రాజు  ఈ సన్మానాన్ని అందుకున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో  మాజి ఐ.పి.ఎస్. అధికారి డా.జె.డి. లక్ష్మినారాయణ,  సినీయర్ ఐ.ఏ.యస్. అధికారి  డా.అద్దంకి  శ్రీధర్ బాబు, ఐ.ఏ.యస్. ఈ గురుకులం ఫౌండర్  ఆకెళ్ల రాఘవేంద్రరావు  , ప్రొఫెసర్ విశ్వనాథమ్, వెల్నెస్ అకాడమీ బెంగులూర్  చైర్మన్ యస్.ఎచ్ కులకర్ణి గారు వక్తలుగా  పాల్గొన్నారు.
వక్తలు  మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువుతో పాటు, జీవన నైపుణ్యాలను పెంపొందించే కృషి చేయాలని కోరారు. అందుకే గురువును త్రి మూర్తులుతో పోల్చుతారు అని అన్నారు. గురువు గొప్పనా దేవుడు గొప్పనా అని కబీర్ దాసుని అడిగితే గురువుకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు అని వివరించారు.   టీచర్స్ రిలేషన్ షిప్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్ పేరిట నిర్వహించిన అవగాహన సదస్సులో  ఫౌండేషన్ చైర్మన్ శ్యాముల్ రెడ్డి,  ఫౌండేషన్ లక్ష్యాలను ఆశయాలను వివరించి, వాటిలో ఉపాధ్యాయులందరూ భాగస్వామ్యం కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పౌండేషన్  డైరెక్టర్  అంజిరెడ్డి, జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ మూర్తి, ఉపాధ్యక్షులు కృష్ణ భరత్, ప్రధాన కార్యదర్శి షేక్ మీరావలి, రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి,  పలువురు   సభ్యులు పాల్గొన్నారు.

కాగా  ఉత్త‌మ ఉపాధ్యాయ పుర‌స్కారాన్ని పొందిన రాజుకు ప‌లువురు ప్ర‌ముఖులు అభినందించారు. గ‌తంలో  తెలుగు కవితా వైభవం నుండి కవి మిత్ర బిరుదును  పొందిన రాజు, అనేక  క‌విత‌లు, వ్యాసాల‌ను ర‌చించి పేరొందారు. డా.బీ.ఆర్ అంబేద్క‌ర్ సార్వ‌త్రిక విశ్వ‌విద్యాల‌యం నుండి ఎం.ఏ తెలుగు పూర్తి చేసిన ఆయ‌న విద్యార్థి మిత్రుల‌తో  అమ్మంటే క‌వితా సంక‌ల‌నం ఆవిష్క‌ర‌ణ‌కు తోడ్పాటును అందించారు. తెలుగు ఉపాధ్యాయునిగా, వ్యాఖ్యాత‌గా, రచయితగా పేరు పొందారు. ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల సంద‌ర్భంగా 2017లో తెలంగాణ సాహిత్య అకాడ‌మి చైర్మ‌న్ డాక్ట‌ర్ నందిని సిధారెడ్డి చేతుల మీదుగా హైద్రాబాద్‌లో స‌న్మానం అందుకున్నారు. జ‌ల నిధి కాలేశ్వ‌రం, యాదాద్రి శిల్ప‌క‌ళా వైభ‌వం క‌వ‌న భేరి, వెన్నెల పాట‌, పాట‌ల తోట‌మాలి, క‌వితా  విశ్వంభ‌రుడు, సిరివెన్నెల‌లో ప్ర‌చురిత‌మైన ర‌చ‌న‌లు రాజుకు ఎంతో పేరును తీసుకువ‌చ్చాయి. మూడు మార్లు ఉత్త‌మ ఉపాధ్యాయ పుర‌స్కారాన్ని పాఠ‌శాల స్థాయిలో గతంలో అందుకున్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్స‌వ సందర్భంగా, గురు స్పందన పుర‌స్కారాన్ని ముప్పిడి రాజు అందుకోవ‌డం వలన, పాఠశాల ప్రిన్సిపాల్ తోటి ఉపాధ్యాయులు, స్నేహితులు వారి తల్లిదండ్రులు  అభినందించారు.