కృష్ణవేణి ఉన్నత పాఠశాల షాద్నగర్ భాగ్యనగర్ కాలనీ నందు నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను

 

 

 

 

 

 

జనం సాక్షి షాద్ నగర్:-ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి ప్రేమలత యుగంధర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి వారితోపాటు పోటీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థుల తల్లులకు వివిధ రకాలైన ఆటల పోటీలను నిర్వహించడం జరిగింది మరియు పాఠశాల ఉపాధ్యాయులకు కూడా ఆట పోటీలు నిర్వహించడం జరిగింది బహుమతులను ప్రదానం చేశారు . ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి రఫత్ సుల్తానా గారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఎంత సాధించిన కొద్దిమంది నేటికీ ఇంకా వివక్షతకు గురి అవుతున్నారని తమ అభిప్రాయం తెలిపారు మరియు వారు మాట్లాడుతూ
స్త్రీ లేకపోతే జననం లేదు.గమనం లేదు. సృష్టిలో జీవం లేదు. అసలు సృష్టే లేదు.అని వ్యక్తం చేశారు.పాఠశాల విద్యార్థుల పేరెంట్స్ ప్రిన్సిపల్ గారిని తగువిధంగా సత్కరించారు.