కృష్ణాజలాల సరఫరాపై నివేదిక ఇవ్వండి . హైకోర్టు
హైదరాబాద్. జంటనగరాలతోపాటు నల్గోండ , కృష్ణా, పశ్చిమగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి కోసం సరఫరా చేస్తున్న కృష్ణాజలాలపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని అదేశించింది. జంటనగరాల తాగునీటి అవసరాలకోసం కాకుండా సాగర్ నుంచి సాగునీటిని విడుదల చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు… ప్రస్తుత స్థితిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని అదేశించారు. తదుపరి విచారణకు వాయిదా వేశారు.



