కృష్ణానదిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

మానపాడు: మహబూబ్‌నగర్‌ జిల్లా మానపాడు మండలం పాలపాడు గ్రామ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు
ప్రమాదవశాత్తూ కృష్ణానదిలోకి దూసుకెళ్లింది. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఎటువంటి
ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ వూపిరి పీల్చుకున్నారు. డ్రైవర్‌ మధ్యం మత్తులో ఉండడం వల్లే
బస్సు అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లిదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.