కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాలి

కడప, జూలై 11 : న్యాయవిద్యను నిర్వీర్యం చేసేందుకు కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయవాదులందరూ సమష్టి ఉద్యమానికి సిద్ధం కావాలని కడప జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సంపత్‌కుమార్‌ పిలుపునిచ్చారు. న్యాయవిద్యను పర్యవేక్షిస్తున్న బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తన అధికారాలు కోల్పోయేలా కేంద్రప్రభుత్వం ఒక ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నదని అన్నారు. ఈ బిల్లు ద్వారా బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తన అధికారాలను కోల్పోనున్నదని చెప్పారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా న్యాయవాదులు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కడప జిల్లాలో న్యాయవాదులందరూ బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం విధులను బహిష్కరించారు.