కేఎల్‌ఐ కాల్వలో పడి వ్యక్తి మృతి

కొల్లపూర్‌: మండలంలోని మాచినేని పల్లి గ్రామానికి చెందిన గద్దే సత్యం శుక్రవారం అర్ధరాత్రి కేఎల్‌ఐ పిల్లకాల్వలో పడి మృతి చెందాడు. కొల్లపూర్‌ సుంచి కూతురు మాదవితో కలిసి మోటర్‌ సైకిల్‌ స్వగ్రామానికి వస్తుండగా కెనాల్‌ పిల్ల కాల్వ వద్దకు రాగానే ప్రమాదవశాత్తు దానిలో పడి పోయి సత్యం చనిపోగా కుమార్తె మాధవి ప్రాణాలతో బయట పడింది. ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, కొల్లపూర్‌ ఎప్సై రాజలు సంఘటనా స్థలాన్ని సంర్శించారు.