కేసీఆర్‌ తెలంగాణ మొత్తానికే లోకల్‌

కేసీఆర్‌ రాకతో కామారెడ్డి పూర్తిగా మారుతుంది
ఆ బాధ్యత పూర్తిగా నేనే తీసుకుంటా..
విశ్వాసం ఉంచి.. బీఆర్‌ఎస్‌ను గెలిపించండి
సిరిసిల్ల, కామారెడ్డి రోడ్‌షోలలో కేటీఆర్‌
రాజన్న సిరిసిల్ల బ్యూరో,కామారెడ్డి(జనంసాక్షి): కేసీఆర్‌ రాకతో కామారెడ్డి పూర్తిగా మారిపోతుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. పట్టణాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు.కామారెడ్డిలో నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌కు లోకల్‌, నాన్‌ లోకల్‌ ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు.’’అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నారు.. ఇక్కడ రాష్ట్రాన్నే తెచ్చిన సీఎం ఉన్నారు. ఆయనకు లోకల్‌, నాన్‌లోకల్‌ ఉంటుందా?కేసీఆర్‌ తెలంగాణ మొత్తానికే లోకల్‌. కాంగ్రెస్‌, భాజపా అభ్యర్థుల్లో ఎవరు లోకల్‌?కేసీఆర్‌ అమ్మగారి ఊరు ఇక్కడే సవిూపంలోని కోనాపూర్‌. అలాంటప్పుడు ఎవరు లోకల్‌?’’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.’’తెలంగాణ మినహా ఏ రాష్ట్రంలోనూ బీడీ కార్మికులకు పింఛన్లు లేవు. భారాస మళ్లీ గెలిస్తే బీడీ కార్మికుల పింఛనుకు కటాఫ్‌ డేట్‌ తొలగిస్తాం. రాష్ట్రంలో 4.5లక్షల మంది బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నాం. మరోసారి అధికారంలోకి వస్తే పింఛన్లను దశలవారీగా రూ.5వేలకు పెంచుతాం. జనవరిలో కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేస్తాం. రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ రూ.5లక్షల బీమా కల్పిస్తాం. అసైన్డ్‌ భూములపై యజమానులకు పూర్తి పట్టా హక్కులు ఇస్తాం’’ అని కేటీఆర్‌ అన్నారు.ఎన్నికల ప్రచారం చివరి రోజున మంత్రి కేటీఆర్‌ కామారెడ్డిలో నిర్వహించిన రోడ్‌?షోలో పాల్గొన్నారు. కేసీఆర్‌ రాకతో కామారెడ్డి పూర్తిగా మారుతుందని అన్నారు. బీఆర్‌ఎస్‌ విడుదల చేసిన మేనిఫెస్టోను మరోసారి ప్రజలకు వివరించారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి ఇవాళ చివరి రోజు అయినందున బీఆర్‌ఎస్‌ నేతలు సభలు, కార్నర్‌ మీటింగ్‌?లు, రోడ్‌?షోలతో బీజీగా ఉన్నారు. కేసీఆర్‌ బరిలో నిలిచిన కామారెడ్డి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడ మాట్లాడిన ఆయన కేసీఆర్‌ రాకతో కామారెడ్డి పూర్తిగా మారిపోతుందని తెలిపారు. ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తానే పూర్తిగా తీసుకుంటానని హామీ ఇచ్చారు. తెలంగాణను తెచ్చిన కేసీఆర్‌?కు లోకల్‌,? నాన్‌? లోకల్‌? అని ఉంటుందా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ మినహా.. ఏ రాష్ట్రంలోనూ బీడీ కార్మికులకు పింఛన్లు లేవని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ మళ్లీ గెలిస్తే.. బీజీ కార్మికులకు పింఛను కటాఫ్‌ డేట్‌?ను తొలగిస్తామని మాట ఇచ్చారు. రాష్ట్రంలో 4.5 లక్షల మంది బీడీ కార్మికులకు పింఛను ఇస్తున్నామని తెలిపారు. ఈ తొమ్మిదిన్నరేళ్లలో దేశానికి, తెలంగాణకు మోదీ చేసింది శూన్యమని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే.. బీడీ కార్మికులకు ఇచ్చే ఫించన్‌?ను దశలవారిగా రూ.5వేలకు పెంచుతామన్న ఆయన.. జనవరిలో కొత్త రేషన్‌ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. తెల్ల రేషన్‌?కార్డు ఉన్నవారికి అన్నపూర్ణ పథకం కింద అందరికి సన్నబియ్యం ఇస్తామని తెలిపారు. ఆరు నెలలకో సీఎం మారే మార్పు కావాలా? సిరిసిల్ల ఉరిసిల్లగా మారే మార్పు కావాలా? రైతుబంధు బందయ్యే మార్పు కావాలా? మార్పు కావాలి.. అందుకే తెలంగాణ తెచ్చుకున్నాం. ఒకసారి అందరూ తెలంగాణను ఎందుకు తెచ్చుకున్నామో అందరు ఆలోచించాలని అన్నారు.  ఒకసారి కేసీఆర్‌? కామారెడ్డికి ఎమ్మెల్యే అయితే ఎంత అభివృద్ధి జరుగుతుందో ప్రజలు ఆలోచించాలని కోరారు. కేసీఆర్‌ అధికారంలోకి వస్తే గోదావరి నీళ్లు కామారెడ్డికి తెచ్చే బాధ్యత కేటీఆర్‌?దని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే ఈ నియోజకవర్గంలో విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్‌, బీజేపీ చేసే ఆరోపణలు నమ్మవద్దని ప్రజలను సూచించారు. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు.  కామారెడ్డి రోడ్‌?షో అనంతరం మంత్రి కేటీఆర్‌ సిరిసిల్లాలో నిర్వహించిన రోడ్‌?షోలో పాల్గొన్నారు. అక్కడ మాట్లాడిన ఆయన ఎన్నడు లేని విధంగా చరిత్రలో గుర్తుకుపెట్టుకునేలా సిరిసిల్లాను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి పథకాన్ని, నేతన్నకు బతుకునిచ్చే కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. అన్ని వర్గాలకు మేలు చేసే కార్యక్రమాలు తీసుకువచ్చామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.
విశ్వాసం ఉంచి.. బీఆర్‌ఎస్‌ను గెలిపించండి
రాజన్న సిరిసిల్ల బ్యూరో: సిరిసిల్లలో జరిగిన అభివృద్ధిని చూసి తనపై విశ్వాసం ఉంచాలని కుల సెంటిమెంట్‌ కు మోసపోవద్దని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల ప్రజలను ఉద్దేశించి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం అంబేద్కర్‌ చౌరస్తా వద్ద నిర్వహించిన రోడ్‌ షోలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణ ప్రజలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ 2009లో సిరిసిల్ల  ప్రజలు ఆదరిస్తే తెలంగాణ రాష్ట్ర స్థాన ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పనిచేశానని అన్నారు. 2009 నుంచి 14 దాకా  రాష్ట్ర ప్రధాన కోసం అనేక పోరాట రూపాలను తీసుకొని సీఎం కేసీఆర్‌ ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన విషయం గుర్తు చేశారు. 2014లో 63 సీట్లతో అధికారంలోకి వచ్చిన బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అందించిందని అన్నారు. రెండోసారి 80 సీట్లతో సంపూర్ణ మెజార్టీ అందించారని ఇవాళ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం  అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉందని తెలిపారు. ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. మూడోసారి కూడా భారత రాష్ట్ర సమితికి అవకాశం ఇవ్వాలని కోరారు. అనేకసార్లు అవకాశం ఇచ్చిన ఏమి చేయలేని కాంగ్రెస్‌ పార్టీ మరోసారి అవకాశం కావాలంటూ అడగడం విడ్డూరంగా ఉందని అన్నారు. రేవంత్‌ రెడ్డి జిల్లాలో ఏ నియోజకవర్గానికి పోయి చూసిన ప్రభుత్వం అందించిన సంక్షేమ ఫలితాలు కనిపిస్తాయని అన్నారు.సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నేతన్నలు తనపై అలిగినట్లు తెలిసిందని అన్నారు. అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంతోపాటు నేతన్నల కోసం వర్కర్‌ టు ఓనర్‌ పథకం, కాటన్‌ వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.వస్త్ర పరిశ్రమను తిరుపూర్‌ లా తీర్చిదిద్దుకుందామని తెలిపారు. విలీన గ్రామాలపై మాట్లాడుతూ ప్రజలు కోరుకుంటే తిరిగి గ్రామపంచాయతీలను చేస్తామని అన్నారు. సిరిసిల్లలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు కుల సెంటిమెంటుతో రాజకీయం చేస్తున్నారని తనపై విశ్వాసం ఉంచి ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు బిఆర్‌ఎస్‌ నాయకులతో పాటు తరలివచ్చిన ప్రజలతో అంబేద్కర్‌ చౌరస్తా గులాబీమయంగా మారింది.