* కేసీఆర్ ను కలసిన మంత్రి గంగుల

కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) :
మంత్రిగా 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం హైదరాబాద్ ప్రగతి భవన్ లో తెలంగాణ బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ గంగుల కమలాకర్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గంగుల కమలాకర్ ను పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రిగా విజయవంతంగా విధులు నిర్వహిస్తున్న గంగులను అభినందించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఇంకా శ్రమించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు.