కొడిమ్యాల మండలంలో ఉత్తమ అభ్యాసకులకు బహుమతులు

కొడిమ్యాల : మండలంలోని వివిధ గ్రామాల్లో సాక్షర భారతి కేంద్రాలద్వారా విద్యనభ్యసిస్తున్న వారిలో ఉత్తమ అభ్యాసకులను ఎంపిక చేసి ఎంపీడీవో వీర బుచ్చయ్య వారికి బహుమతులు అందజేశారు శనివారం మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్‌ ఆదిరెడ్డి మండల కోఆర్డిరోటర్‌ జలంధర్‌ తదితరులు పాల్గొన్నారు