కొనసాగుతున్న అమ్మనబోలు మండల దీక్ష

నార్కట్ పల్లి ఆగస్టు 5 జనంసాక్షి : అమ్మనబోలును మండలం చేయాలని 13వ రోజు దీక్షలో భాగంగా శుక్రవారం వంట వార్పు కార్యక్రమం చేసి రోడ్డుపైనే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.  ప్రభుత్వం వెంటనే అమ్మనబోలు ను మండలంగా ప్రకటించాలని లేకపోతే ఆందోళనలు మరింత తీవ్రంగా చేస్తామని తెలిపారు. అమ్మనబోలు – మోత్కూరు రహదారి పై ధర్నా ,రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ లు,ఎంపీటీసీ లు, నాయకులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.