కొనసాగుతున్న తెదేపా బృందం నిరసన

హైదరాబాద్‌: సచివాలయంలోని సీఎం సమావేశమందిరంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం నిరసన కొనసాగుతోంది. దాంతో సచివాలయంలోని సీ బ్లాక్‌ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సీ బ్లాక్‌ మొత్తం విద్యుత్‌ సరఫరా నిలిపేశారు. సీఎం ఛాంబర్‌లో ఎవర్ని అరెస్టు చేయాలన్నా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి తప్పనిసరి. దాంతో తెదేపా నేతలను అరెస్టు చేసేందుకు భద్రతా సిబ్బంది సీఎన్‌ అనుమతి కోరుతున్నట్లు సమాచారం.