కొమురవెల్లి ఎఇ అంజయ్య సస్పెన్షన్‌

సిద్దిపేట,సెప్టెంబర్‌28(జనం సాక్షి): కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఏఈగా విధులు నిర్వహిస్తున్న బ్రహ్మాండ్లపల్లి అంజయ్య సస్పెన్షన్‌కు గురయ్యారు. 2011లో అంజయ్య ఉద్యోగ పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో సర్వీస్‌ను కొనసాగించారు. 10 సంవత్సరాలుగా 70లక్షల ఆదాయాన్ని అంజయ్య పొందారు. రెండేళ్లుగా దేవాదాయశాఖ అధికారులకు అందిన ఫిర్యాదుల మేరకు అధికారులు విచారణ చేపట్టారు. దేవాదాయ శాఖ అధికారుల విచారణ అనంతరం ఏఈ అంజయ్యను ఈవో బాలాజీ శర్మ సస్పెండ్‌ చేశారు.