కొవ్వాడ అణు విద్యుత్‌కు వ్యతిరేకంగా ఆందోళన
శ్రీకాకుళం : కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా స్థానికుల ఆందోళన ఉద్థృతమైంది. కొవ్వాడ గ్రామస్థులు ఈ ఉదయం నిరసనలకు దిగి గ్రామానికి వచ్చిన ఆర్డీవో, ఇతర అధికారులను అడ్డుకున్నారు. ప్రాజెక్టును విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆందోళనతో అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగిపోయారు.
.