కోటిఎకరాలకు సాగు నీరు

C

వెలుగుల తెలంగాణ

అందరి అభివృద్దే బంగారు తెలంగాణ లక్ష్యం

ఖమ్మం ప్లీనరీ వేదికగా సిఎం కేసీిఆర్‌ వెల్లడి

ఖమ్మం బ్యూరో, ఏప్రిల్‌27(జనంసాక్షి):

అన్నివర్గాల అభివృద్ది జరిగి అందరూ సుఖసంతోషాలతో ఉన్నప్పుడే మనం కలలు కన్న  బంగారు తెలంగాణ సాకారమవుతుందని టిఆర్‌ఎస్‌ అధినేత, సిఎం కెసిఆర్‌ అన్నారు. దళితబడుగు, బలహీనవర్గాఆలు, చాకలిమంగలి, కుమ్మరి సబ్బండ జాతులు ఆర్థికంగా పురోభివృద్ది సాధిస్తేనే మనం కోరుకున్న బంగారు తెలంగాణ వచ్చినట్లని అన్నారు. ఖమ్మంలో టిఆర్‌ఎస్‌ ప్లీనరీ వేదికగా పార్టీ 15వ ఆరవిర్భావ సదస్సులో ఆయన తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఖమ్మం సవిూపంలోని చెరుకూరి గార్డెన్స్‌లో జరుగుతున్న ప్లీనరీ సమావేశాల్లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, సీఎం కేసీఆర్‌ పాల్గొని అధ్యక్షోపన్యాసం చేశారు.  తొలుత తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్లీనరీ ప్రాంగణంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి సభా వేదికపై ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి సీఎం పుష్పాంజలి ఘటించారు. సభా వేదికపై ఎంపీ కేశవరావుతో పాటు మంత్రివర్గ సభ్యులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ పెద్దలు ఆసీనులయ్యారు. తెలంగాణను కొట్లాడి సాధించుకున్నామని, దానిని సంపూర్ణంగా అభివృద్ది చేసుకుని, అన్ని వర్గాలను ముందుకు తీసుకుని వెల్లాల్సి ఉందన్నారు. ఏ కొందరో బాగుపడితే బంగారు తెలంగాణకు అర్థం లేదని ముక్కుసూటిగా చెప్పారు. తెలంగాణలో ఇక కరెంట్‌ కోతలు లేవని, చీకట్లు తొలగాయని, కరెంట్‌ గురించి అవాకులు చెవాకుల పేలిన వారి నోళ్లు మూయించామన్నారు. ఇక వెలుగుల తెలంగాణ మాత్రమే ఉంటుందన్నారు. త్వరలోనే జైపూర్‌ విద్యుత్‌ వస్తుందన్నారు. ఇక రాస్టంతో పాటు దేశం మొత్తం విపరీతమైన కరవు నెలకొందన్నారు. ఎక్కడ చూసినా నీటి కకొరత ఉందన్నారు. మనం చేపట్టిన మిషన్‌ భగీరథతో మంచినీటి సమస్య తీరనుందన్నారు. ఈ పథకం అమలులో ప్రతి ఒక్కరూ ఒక్కో భగీరథుడు కావాలన్నారు.  14 ఏళ్ల పాటు నిరంతరం సాగిన ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని తెలంగాణ సాధించినం. స్వరాష్ట్రంలో స్వేచ్ఛావాయువుల మధ్య ప్లీనరీ నిర్వహించుకుంటున్నం. ప్రపంచ ఉద్యమాల చరిత్రకు భాష్యం చెప్పేలా తెలంగాణ ఉద్యమం జరిగింది. పార్లమెంట్‌ చరిత్రలో 36 పార్టీలను ఏకం చేయగలిగినం. అవిశ్రాంతంగా పోరాడినం కాబట్టే తెలంగాణ సాధించినం. తెలంగాణ సమాజం నుంచి వచ్చిన అభిప్రాయం మేరకు ఎన్నికల్లో పోటీ చేసి అఖండ విజయం సాధించినమని సీఎం పేర్కొన్నారు.  ప్రపంచ ఉద్యమాలకు భాష్యం చెప్పేలా తెలంగాణ ఉద్యమం జరిగిందని  కేసీఆర్‌ అన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ధీరులు అవరోధాలను అధిగమించి లక్ష్యం వైపు సాగుతారు. తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజలే బాసులు అని సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్టరం వచ్చినా ఎన్నో అవరోధాలు సృష్టించారు. ఎన్నో బాలారిష్టాలు తట్టుకుని హిమాలయ మంత ఎత్తుకు ఎదిగింది తెలంగాణ రాష్ట్రం. ఎన్నికలు ఏవైనా ప్రజలు అపూర్వమైన మద్దతు ఇస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌, వరంగల్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌తోనే ఉంటామని చాటిచెప్పారు.  వరంగల్‌ ఎంపీగా పసునూరి అధిక మెజారిటీతో గెలిపించడం అపూర్వఘట్టమన్నారు.  జీహెచ్‌ఎంసీలో కనీవినీ ఎరగని విజయాన్ని సొంతం చేసుకున్నం. మనకు గర్వం పనికిరాదు, అపజయాన్ని

చూసి కుంగిపోవద్దు. జయాన్ని చూసి పొంగిపోవద్దు. తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజలే బాసులు. వర్తమానం, భవిష్యత్‌ విూదనే దృష్టి సారించాలి. తెలంగాణ పునర్‌నిర్మాణ మహాయజ్ఞంలో అందరం కార్యకర్తలమేనని ఆయన పేర్కొన్నారు. ధీరులెవరైనా అవరోధాలు అధిగమిస్తూ లక్ష్యం వైపు సాగుతుంటారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ధీరులుగా వ్యవహరించిన ఘనులు లక్షలాది మంది కార్యకర్తలేనన్నారు. ఎన్నో బెదిరింపులు, అవమానాలు, అవహేళనలు తట్టుకున్నాం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కార్యకర్తలు నాయకత్వం వెంట నడిచారు.. ఇవాళ స్వరాష్ట్రంలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామన్నారు. ఎన్నో బాలారిష్టాలు ఎదుర్కొని.. ఎవరూ అందుకోలేని ఎత్తుకు ఎదిగాం. ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు తెరాసకు అపూర్వమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారుగతం, వర్తమానం, భవిష్యత్‌పై ఆలోచించుకోవాలని నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో గొప్పగా ముందుకెళ్తున్నదని ప్రధాని ప్రశంసించినట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. దేశంలోనే సంక్షేమ రంగంలో ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ గొప్పగా ముందుకెళ్తున్నదని ప్రధాని ప్రశంసించిన విషయాన్‌ఇన గుర్తు చేశారు. . మేనిఫెస్టో వందశాతం అమలు చేసినం కాబట్టే ప్రజాదరణ ఉంది. కేజీ టు పీజీలో భాగంగానే 250 గురుకులాలు ఏర్పాటు చేస్తున్నం. 100 శాతం ఎన్నికల ప్రణాళికను అమలు చేసిన ఏకైక పార్టీ టీఆర్‌ఎస్‌ అన్నారు. ఎన్నికల్లో హావిూ ఇవ్వని హావిూలను సైతం అమలు చేస్తున్నం. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ లాంటి గొప్ప పథకాలను అమలు చేస్తున్నం. ఉద్యోగాల విషయంలో గతంలో మనకు అన్యాయం జరిగింది. నిధులు, నియామకాలు అన్న బాధ రాష్ట్రం రావడం వల్ల తొలిగిపోయింది. సమైక్య పాలనలో 25 వేల చెరువులు కనుమరుగైనయి. మిషన్‌ కాకతీయలో 46 వేల చెరువులను పునరుద్దరిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. మిషన్‌ భగీరథతో మంచినీటి కొరత తీరనుందన్నారు. టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఒక్కో భగీరథుడై ఈ కార్యక్రమాన్ని ముందుకు తసీఉకుని వెళ్లాలని అన్నారు. రాష్ట్ర మంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ, తుమ్మల నాగేశ్వరరావు, చందూలాల్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీలు కె.కేశవరావు, కవిత, జితేందర్‌రెడ్డి, బాల్క సుమన్‌, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన 5వేల మంది ప్రతినిధులు ప్లీనరీలో పాల్గొన్నారు. తొలుత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు.