‘గగన్‌’కు 50 లక్షల నజరానాను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌: లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్యపతకం సాదించిన భారత షూటర్‌ గగన్‌ నారంగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షల నజరానాను ప్రకటించింది. సచివాలయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నారంగ్‌ తల్లిదండ్రులు కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారికి అభినందనలు తెలియజేశారు. నారంగ్‌ హైదరాబాద్‌కు చెందిన క్రీడాకారుడు కావడం విశేషం.