గిరిజనుల ఆర్ధికాభివృద్ధి టీఆర్ఎస్ ధ్యేయం

.బిజినేపల్లి. గిరిజనులు బిజినేపల్లి, సెప్టెంబరు 19( జనం సాక్షి). గ్రామాలకు దూరంగా జీవనం సాగిస్తున్న గిరిజనులకు సామాజికంగా గుర్తింపు తీసుకొచ్చి వారి ఆర్ధికాభివృద్దే టీఆర్ఎస్ ధ్యేయమని ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో సోమవారం సీఎం కేసీఆర్ చిత్ర పటానికి గిరిజనులతో కలిసి పాలాభిషేకం చేసి మాట్లాడారు. గిరిజన తండలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించి గుర్తింపు తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ గిరిజన బంధుతో వారిని ఆర్థికాభివృద్ధికి బాటలు వేశారని కొనియాడారు. తండ పంచాయతీలను స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సహాకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నామని అన్నారు. రాబోయ్యే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు మ మడావత్ రామునాయక్, గిరిజన తండాల సర్పంచులు చందులాల్, రమణి, మాన్యానాయక్, గోవిందునాయక్, పాండునాయక్, శం కర్నాయక్, కృష్ణలక్ష్మి నాయక్, మంగ్లీ, లింఖ్యానాయక్, భారతి, శాంతికృష్ణనాయక్, వంశీనాయక్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area


