గుంటూరులో వైభవంగా జెండా పండగా

గుంటూరు:జిల్లాలోని చిలకలూరిపేటలో ఒక రోజు ముందుగానే మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. 25వేల జాతీయ పతాకాలతో 5వేలమంది విద్యార్థులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలనే ఉద్దేశంతో రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.