గురజాడ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం

హైదరాబాద్‌: రవీంద్రభారతిలో జరిగిన గురజాడ 150వ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, తమిళనాడు గవర్నర్‌ రోశయ్య తదితరులు పాల్గొన్నారు. గురజాడ మనవరాలు బోడపాటి శేషమ్మను సీఎం ఈ సందర్భంగా సత్కరించారు, ఆమెకు ప్రభుత్వం తరపున నెలకు. రూ. 10 వేల పింఛనును ప్రకటించారు.