గేదెల కోసం చెరువులో దిగి మృత్యువాత పడిన రైతు

కమాలాపూర్‌: మాట్ల పోచయ్య(55) మంగళవారం సాయంత్రం తన గేదెలను నీళ్లకోసం గ్రామ శివారులోని ఎర్రకుంట చెరువుకు తీసుకెళ్లాడు. గేదెలను బయటకు తీసుకురావటానికి పోచయ్య చెరువులో దిగి ముళ్లపోదల్లో ఇరుక్కు పోయి మృత్యువాత పడ్డాడు. రాత్రి కూడా రైతు ఇంటికి రాకపోవటంతో బంధువులు అతని ఆచూకీ కోసం వెతకగా చెరువు సమీపంలో దుస్తులు కనిపించాయి. దీంతో చెరువులో గాలించగా బుధవారం మృతదేహం లభ్యమైంది. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.