గోరుచిక్కుడు సాగుకు అవకాశాలు పుష్కలం

హైదరాబాద్‌: రాష్ట్రంలో గోరుచిక్కుడు పంట సాగు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భారత వ్యవసాయ ప్రణాళిక కమీషన్‌ ముఖ్య సలహాదారు డాక్టర్‌ ఆర్వీఎస్‌ సెయినీ అన్నారు. సంప్రదాయంగా సాగు చేసినప్పటికీ వాతావరణ పరిస్థితులకు మంచి అనుకూలంగా ఉన్న దృష్ట్యా వాణిజ్య  పరంగా గోరు చిక్కుడు సాగు చేయడం రైతులకు సులభమని సూచించారు. హైదరాబాద్‌లో పసిఫిక్‌ ఆగ్రో కంపెనీ, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గోరు చిక్కుడు జాతీయ స్థాయి సదస్సుకు  ఆయన హాజరయ్యారు. రాష్ట్రంలో గోరు చిక్కుడు పంట సాగు, మార్కెటింగ్‌ అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించారు.