గ్యాస్ ఇతర రాష్ట్రాలకు తరలడానికి ప్రభుత్వ నిర్లక్షమే కారణం:టీడీపీ
హైదరాబాద్: రాష్ట్రానికి అందాల్సిన గ్యాస్ ఇతర రాష్ట్రాలకు తరలడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే కారణమని టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరర్‌రావు అన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే మంత్రులు ఎందుకు స్పందించడం లేదని విమర్శించారు. ప్రభుత్వం పట్టించుకొకపోవటంతో రత్నగిరి గ్యాస్ తరలిపోయిందని, గ్యాస్ సరఫరా లేక రాష్ట్రంలో విద్యుత్ సంస్థలకు తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు. దీనిపై పార్లమెంట్‌లో జైపాల్‌రెడ్డిని నిలదీస్తామని నామా అన్నారు.