గ్యాస్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం

దేశం మొత్తం కెసిఆర్ నాయకత్వం కోరుకుంటుంది – రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దేశంలో అద్భుతమైన విజయాలు చవిచూస్తుంది – ఖాళీ గ్యాస్ బండలతో నల్ల జెండాలతో కట్టెల పొయ్యిలతో మహిళల పెద్ద ఎత్తున నిరసనాగ్రహ జ్వాలలు- నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సైదిరెడ్డి

హుజూర్ నగర్ మార్చి 3 (జనంసాక్షి): గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ లో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకముగ చేపట్టిన నిరసన కార్యక్రమాలలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిరంకుశ మొండి వైఖరి విధానాలను ఎండగట్టడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరులను నిలదీయడం జరిగింది. 400 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ బండ ధర ఈరోజు 1200 రూపాయలకు తెచ్చిన ఘనత బిజెపి కేంద్ర ప్రభుత్వాన్నిదని, కేంద్ర ప్రభుత్వానికి ప్రజల కష్టసుఖాలు, బాగోగులు పట్టింపులు ఉండవని వారికి కావాల్సిందల్లా ధరలు పెంచుకుంటూ పోవడమేనని అన్నారు. పేద ప్రజలు అష్ట కష్టాలు పడుతున్న, కన్నీరు చిందిస్తున్న ఆరిగోస పడుతున్న ఏమాత్రం పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం కేవలం అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీల భాగోగుల కోసమే తమ విధానాలను తీసుకొని వస్తున్నారని, అదాని తన మోసపూరితమైనటువంటి షేర్ల గోల్మాల్ వ్యవహారంలో చాలా మంది తమ పెట్టుబడులను పెట్టి మోసపోయారని, మధ్యతరగతి, పేద వర్గాలు ఆ షేర్లను కొనుగోలు చేసి దివాలా తీసారని, కేవలం ఏడు రోజులలోనే ఎనిమిది లక్షల కోట్ల రూపాయల సంపాదన ఆవిరి చేశారని అట్టి అదాని నీ కేంద్ర ప్రభుత్వం కాపాడటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుందన్నారు. అదాని, అంబానీ రకరకాల కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన లక్షల కోట్ల అప్పులను బ్యాంకులలో రైట్ ఆఫ్ చేస్తుందన్నారు. ప్రజల సొమ్మని కార్పొరేట్ కంపెనీలకు ఆ విధంగా వారికి అనుకూలంగా విధానాలు చేస్తూ మరొకవైపు పేద, నిరుపేద ప్రజలు జీవించడానికి ఇబ్బంది పడుతున్నటువంటి కాలంలో ఈ విధంగా గ్యాస్ ధరలు పెంచి ప్రజల నడ్డిని విరిచేసి ఏమాత్రం కోలుకోకుండా దెబ్బ మీద దెబ్బ కొడుతూ, ధరల మీద ధరలను పెంచుతూ నిత్యవసరకుల ధరలను కూడా ఆకాశాన్ని అంటేలా పెంచి వారి జీవన విధానాన్ని తీవ్రంగా దోచుకుంటూ ప్రజలు పేదవాళ్లు మరీ పేదవాళ్లుగా, నిరుపేదలు బిచ్చగాళ్లుగా మారుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజలందరూ తెలుసుకొని వ్యతిరేకించి దుష్ట బిజెపి కేంద్ర ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని పిలుపునియ్యడం జరిగింది. పెంచినటువంటి ఈ గ్యాస్ ధరలు చిరు వ్యాపారస్తుల పొట్టను కొడుతున్నాయని, వారు అంతంతమాత్రంగా రోజువారి కూలీని సంపాదించుకునే క్రమంలో ఆ కూలి కూడా గిట్టుబాటు కాక నష్టాల పాలవుతూ చిరు వ్యాపారస్తులు విలవిలాడే రోజులు వస్తున్నాయని, ఈ గ్యాస్ ధరలు పెంచడం వల్ల చిరు వ్యాపారస్తులు కూడా తమ ఉత్పత్తుల ధరలను పెంచి ఆ విధంగా కూడా పేద ప్రజలకే భారంగా సంక్రమిస్తుందని, ఈ విధంగా ప్రత్యక్షంగానో, పరీక్షంగానో బిజెపి కేంద్ర ప్రభుత్వం ప్రజల వుసురుపోసుకుంటుందని తెలియజేశారు. దేశం మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు చూస్తుందని, తెలంగాణలో అమలు చేస్తున్నటువంటి ప్రజాభివృద్ధి సంక్షేమ పథకాలు యావత్ భారతదేశానికి ఒక రోల్ మోడల్ గా తయారయ్యాయని అందుకే దేశ మొత్తం కెసిఆర్ ని తమకు నాయకత్వం వహించి అభివృద్ధి బాటలో వైపు పయనింపజేసే దిశగా తీసుకొని పోవాలని యావత్ భారతదేశం కోరుతుందన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయని, కేసీఆర్ రైతు సంక్షేమ విధానాలతో పేద నిరుపేద ప్రజల సంక్షేమ విధానాలతో భారతదేశ దిశ దశలను నిర్ధారించబోతున్నారని తమ అద్భుతమైనటువంటి పరిపాలన దక్షిణతో ప్రజల అభివృద్ధి సంక్షేమ విధానాలతో రైతు ప్రభుత్వ విధానాలతో రానున్న ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ దేశంలో అద్భుతమైనటువంటి విజయాలను చవిచూస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లీ అర్చనరవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ముడెం గోపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి అమర్ గౌడ్, మహిళా కమిటీ అధ్యక్షురాలు దొంతిరెడ్డి పద్మారామ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు కొమ్ము శీను, జక్కుల శంభయ్య, ఓరుగంటి నాగేశ్వరరావు, గుండా ఫని కుమారి రామ్ రెడ్డి, దొంగరి మంగమ్మవీరారెడ్డి, చిలక బత్తిని సౌజన్యధనుంజయ్, వీర్లపాటి త్రివేణి భాస్కర్, అమరబోయిన గంగరాజు, యువజన కమిటీ అధ్యక్షులు సోమగాని ప్రదీప్ గౌడ్, గూడెపు దీప, రహీమా, చెవుల కవిత, నరసింహారావు, సైదులు, అలీ, కిరణ్, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.