గ్రంథాలయ వారోత్సవాలలో ఉత్సాహాంగా పాల్గొన్న విద్యార్థులు

మెదక్‌, నవంబర్‌ 15 : 45వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఉత్సవాలలో భాగంగా విద్యార్థులు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ వ్యాసరచనలో పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన దాదాపు 70మంది విద్యార్థులు పాల్గొని వారికి కేటాయించిన అంశంపై వ్యాసరచనలో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు.