గ్రామస్థుల సమిష్టి కృషితోనే గ్రామ అభివృద్ధి
ఎంపీపీ జి. స్నేహ
ఇటిక్యాల (జనంసాక్షి) అక్టోబర్ 7 : గ్రామ ప్రజలందరికీ సహకారంతోనే గ్రామ అభివృద్ధి జరుగుతుందని ఎంపీపీ స్నేహ అన్నారు. శనివారం మండల పరిధిలోని సాసనూలు గ్రామంలో స్థానిక సర్పంచ్ మల్లన్న ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ జి. స్నేహ హాజరై పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ. ఈ పాండురంగా రావు, ఉప సర్పంచ్ వీరన్న, పంచాయతీ కార్యదర్శి కౌసల్య, గ్రామస్తులు బాబురెడ్డి, బోయ ఈదన్న, బోయ పెద్దలక్ష్మన్న, మన్నే కృష్ణ, తెలుగు మద్దిలేటి, చాకలి బుడ్డన్న, చాకలి రవి, షేక్షవాలి తదితరులు పాల్గొన్నారు.