ఘనంగా అన్యువల్ డే వేడుకలు

 

 

 

 

 

 

జనం సాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం వెంకటాపూర్ గ్రామంలో గల బిసి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఘనంగా అన్యువల్ డే వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్ సి ఓ గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటి సాధన కోసం కష్టపడి చదవాలన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు అన్ని రకాల వసతులను కల్పిస్తుందన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అందర్నీ ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరోజన, డి సి ఓ సుస్మిత, స్తంభంపల్లి ప్రిన్సిపల్ రాజేశం, వెంకటాపూర్ ప్రిన్సిపాల్ నాగలాత ఉప సర్పంచ్ వెంకటస్వామి, సి ఆర్ పి మల్లయ్య లతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.