ఘనంగా జయ శంకర్‌ జయంతి

గోదావరిఖని: తెరాస సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయయంది వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో రామగుండం రీజియన్‌లోని ఆర్‌జీ 1,2,3,ల్లోని 9 భూగర్భ, 4 ఉపరితల గనులపై జయశంకర్‌ చిత్రపట్టాన్ని ఉంచి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. జయశంకర్‌ ఆశయం తెలంగాణ రాష్ట్ర సాధనను సాకరం చేయడానికి పోరాటాలు ఉద్ధృతం చేయాలని పలువురు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.