ఢలిమిటేషన్‌లో దక్షిణాదిలో సీట్లు తగ్గించే కుట్ర
` తెలంగాణకు సౌంధవుడిలా కిషన్‌రెడ్డి
` ఆయన వల్లే రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు అనుమతి లభించడంలేదు
` సబర్మతి సుందరీకరణను ప్రశంసించి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును మాత్రం వ్యతిరేకిస్తున్నారు
` రాష్ట్రానికి ప్రత్యేకంగా మీరు తీసుకొచ్చిందేమిటో చెప్పాలి
` తెలంగాణ చెల్లించిన పన్నుల్లో పావలా కూడా రాష్ట్రానికి రావట్లేదు
` కేంద్ర ప్రభుత్వం నిధులన్నీ యూపీ, బిహార్‌లకే ఇస్తోంది
` గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి): కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వల్లే రాష్ట్రానికి ప్రాజెక్టులు రావడంలేదని.. తెలంగాణ పాలిట ఆయన సైంధవుడిలా మారారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం గాంధీభవన్‌లో నిర్వహించిన విూడియా సమావేశంలో కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం తీరుపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కిషన్ రెడ్డి వల్లే రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు అనుమతి లభించడంలేదన్నారు. ‘’విూరు ప్రత్యేకంగా తెలంగాణకు తీసుకొచ్చిన ప్రాజెక్టు ఏంటో చెప్పండి కిషన్ రెడ్డి గారూ.. నోరు వేసుకొని బెదిరిస్తే భయపడేవారు ఇక్కడెవరూ లేరు. మెట్రో, ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకొంటున్నారు. సబర్మతి సుందరీకరణను ప్రశంసించిన కిషన్ రెడ్డి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును మాత్రం వ్యతిరేకిస్తున్నారు. మేం ప్రధాని మోదీ వ్యక్తిగత ఆస్తుల్ని అడగడంలేదు. రాష్ట్రం నుంచి కేంద్రానికి భారీగా పన్నులు వెళ్తున్నాయి. తెలంగాణ చెల్లించిన పన్నుల్లో పావలా కూడా రాష్ట్రానికి రావట్లేదు. కేంద్ర ప్రభుత్వం నిధులన్నీ యూపీ, బిహార్‌లకే ఇస్తోంది’’ అని విమర్శించారు.’’తెలంగాణలో ప్రాజెక్టుల గురించి కేంద్రమంత్రి వర్గంలో ఎప్పుడైనా ప్రస్తావించారా?ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్టులను విూరు రాష్ట్రానికి సాధించారు. తెలంగాణ కోసం కేంద్రాన్ని ఏం అడిగారో చెప్పండి. విూరు ప్రస్తావించినవేంటో చెప్పండి. విూకు చిత్తశుద్ధి లేదు. సైంధవ పాత్ర పోషిస్తున్నారు. విూ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే ఈ ప్రాజెక్టులన్నింటికీ అనుమతులు తీసుకొని హైదరాబాద్‌కు రావాలి. గతంలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హావిూ ఇచ్చారు. ఎన్ని కోట్ల మందికి ఇచ్చారో చెప్పండి. తెలంగాణలో కేంద్రం ఎన్ని ఇళ్లు ఇచ్చిందో చెప్పండి. రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చి కేంద్రం వందల మందిని బలితీసుకుంది. మెట్రో నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు ఉన్నాయా అని కిషన్ రెడ్డి అవహేళన చేస్తున్నారు. మేం దిల్లీకి వెళ్లి లిక్కర్ దందాలు చేయడంలేదు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం వెళ్తున్నాం’’ అన్నారు.ఏ రాష్ట్రంపైనా ఒక భాషను బలవంతంగా రుద్దొద్దు. మన మాతృభాష తెలుగు పరిరక్షణకు మేం కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వం అన్ని జీవోలను తెలుగులో కూడా ఇస్తోంది. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నారు. సీట్లు తగ్గవు అంటున్నారు.. కానీ పెరుగుతాయని మాత్రం ఎక్కడా చెప్పట్లేదు. డీలిమిటేషన్ పేరిట దక్షిణాదికి అన్యాయం చేసేందుకు భాజపా కుట్ర చేస్తోంది. ఉత్తరాదిలో సీట్లు పెంచుకొని ఆ రాష్ట్రాల సీట్లతోనే అధికారంలోకి రావాలని భాజపా చూస్తోంది. ఇప్పటికే నిధులన్నీ ఉత్తరాది రాష్ట్రాలకు ఇస్తూ.. దక్షిణాదికి అన్యాయం చేస్తున్నారు. సీట్లు రాని దక్షిణాది రాష్ట్రాలను మాత్రం నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నారు’’ అని విరుచుకుపడ్డారు.
రాష్ట్రానికి నిధులు మంజూరు చేయించే బాధ్యత మీదే..
` కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్ 9 పేజీల సుధీర్ఘ లేఖ
` మెట్రో విస్తరణకు ఐదు కారిడార్ల ప్రతిపాదనలు చేశామని వివరణ
` తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని లేఖలో పేర్కొన్న సీఎం
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి 9 పేజీల లేఖ రాశారు. ‘తెలంగాణ రాష్ట్రానికి ప్రాజెక్టుల మంజూరులో కేంద్ర క్యాబినెట్ మంత్రిగా మీ బాధ్యతను గుర్తు చేయడం కోసం లేఖ’ అని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రాలకు ప్రాజెక్టుల మంజూరులో సీఎం రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారన్న వ్యాఖ్యలు పూర్తి బాధ్యతారాహిత్యమని, తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిగా తెలంగాణకు కిషన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలన్నారు. తెలంగాణ అభివృద్ధికి హైదరాబాద్ మెట్రో ఫేజ్, ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్), మూసీ పునరుజ్జీవనం, రీజినల్ రింగ్ రైలు, డ్రైపోర్ట్ ఏపీలోని బందరు సీ పోర్టుకు గ్రీన్ ఫీల్డ్ రహదారి కీలకమని అన్నారు. వాటి నిర్మాణాలకు సంబంధించి అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వ విధివిధానాలను పూర్తిగా పాటిస్తున్నామని తెలిపారు. ఆయా ప్రాజెక్టుల సాధన కోసం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులతో పాటు మిమ్మల్ని (కిషన్ రెడ్డి) కలిసిన విషయాన్ని గుర్తు చేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మెట్రో ఫేజ్ -1 69 కి.మీ. నిర్మాణాన్ని ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మెట్రో రాకతో హైదరాబాద్ నగరంలో అభివృద్ధి పరుగులు పెట్టిందని, గత పదేళ్లలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 ప్రాజెక్ట్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, సీఎంగా తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైదరాబాద్ మెట్రో ఫేజ్-11 ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించామని తెలిపారు. మెట్రో సేవలను విస్తరించడమే లక్ష్యంగా అయిదు కారిడార్లను ప్రతిపాదించామన్నారు. నాగోల్- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (36.8 కి.మీ.), రాయదుర్గం-కోకాపేట నియోపొలిస్ (11.6 3.2.), ఎంజీబీఎస్- చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.), మియాపూర్-పటాన్ చెరు (13.4 కి.మీ.), ఎల్‌బీనగర్- హయత్ నగర్ (7.1 కి.మీ.). ఈ ఐదు కారిడార్ల నిర్మాణానికి రూ. 24,269 కోట్లతో ప్రతిపాదనలు ఆమోదించాలని నాటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీకి (2024, జనవరి 4వ తేదీ) వినతిపత్రం అందజేశామని చెప్పారు. 2024, అక్టోబరు ఏడో తేదీన ప్రస్తుత కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్కు ప్రతిపాదనలు అందజేశామని తెలిపారు. 2024, నవంబరు నాలుగో తేదీన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు మెట్రో ఫేజ్- 11 డిటైయిల్డ్ రిపోర్ట్ సమర్పించామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 2024, డిసెంబరు 12వ తేదీన ఢల్లీిలో తాను మీతో (కిషన్ రెడ్డి) సమావేశమై హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాల లేఖను అందజేశానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు 2025, ఫిబ్రవరి 26వ తేదీన ఇదే అంశంపై లేఖ అందజేశానన్నారు. మెట్రో ఫేజ్-కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాలని అన్ని లేఖల్లో స్పష్టంగా వివరించినట్లు ఆయన తెలిపారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను 2024, జులై 22న కలిసి వివరాలతో కూడిన లేఖను అందజేశామన్నారు. మీతో (కిషన్ రెడ్డి) సమావేశమైన రోజు మూసీ పునరుజ్జీవన ప్రాధాన్యాన్ని వివరించడంతో పాటు సమగ్ర వివరాలతో లేఖను అందజేశానని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఈ నెల 21వ తేదీన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్బీ అధికారుల బృందం మిమ్మల్ని కలిసి మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని వివరించారన్నారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మూసీ పునరుజ్జీవంపై లేఖను అందజేశానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలి
` యువతకు సూచించిన రాజ్‌నాథ్‌సింగ్
` యువతపైనే దేశ రక్షణ బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి
` నేషనల్ సైన్స్ డే సందర్భంగా విజ్ఞాన్ వైభవ్ ప్రారంభం
హైదరాబాద్(జనంసాక్షి): శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలని యువతకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపు నిచ్చారు. గ్లోబల్ లీడర్ షిప్‌లో యువతదే కీలక పాత్ర అని ఆయన స్పష్టం చేశారు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా హైదరాబాద్‌లోని విజ్ఞాన్ వైభవ్-2025ను సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చే మార్పుల పట్ల విద్యార్ధులు అవగాహన కలిగి ఉండాలన్నారు. రక్షణ శాఖ చారిత్రాత్మక విజయాల్లో కేంద్రం విశేష పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా ఈ శాఖకు తాను మంత్రిగా ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నాన్నారు. మానవుని మేధ సంపత్తు చాలా గొప్పదని చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రక్షణ శాఖలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో దేశం కొత్త ఒరవడిని సృష్టిస్తోందని పేర్కొన్నారు. దేశంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతోందన్నారు. అన్ని రంగాల్లో భారత్ అగ్రగామిగా మారుతోందని చెప్పారు. రక్షణ శాఖ చారిత్రాత్మక విజయాల్లో కేంద్రం విశేష పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా ఈ శాఖకు తాను మంత్రిగా ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నాన్నారు. మానవుని మేధ సంపత్తు చాలా గొప్పదని చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రక్షణ శాఖలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో దేశం కొత్త ఒరవడిని సృష్టిస్తోందని పేర్కొన్నారు. దేశంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతోందన్నారు. అన్ని రంగాల్లో భారత్ అగ్రగామిగా మారుతోందని చెప్పారు.
కొన్నాళ్లపాటు తాను సైన్స్ అధ్యాపకుడిగా పని చేశానని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడిరచారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా డీఆర్‌డీవో విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన ప్రదర్శనకు కేంద్ర రక్షణమంత్రి హాజరై ప్రసంగించారు.నోబెల్ గ్రహీత సర్ సీవీ రామన్ ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నారని.. ఆయన గౌరవార్థం ఏటా ఈరోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని గుర్తు చేశారు. ప్రస్తుతం వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో సైన్స్ ముఖ్యపాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. తాను కూడా సైన్స్ విద్యార్థినేనని.. కొన్నాళ్లు సైన్స్ అధ్యాపకుడిగా కూడా పనిచేసినట్లు పునరుద్ఘాటించారు. సైన్స్ వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులు గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులనుద్దేశించి ప్రసంగించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. మానవ పరిణామ క్రమాన్ని, సైన్స్ అభివృద్ధిని విద్యార్థులు అధ్యయనం చేయాలని సూచించారు. ఇన్నోవేషన్, దేశ ప్రగతిలో విద్యార్థులదే కీలకపాత్రన్న ఆయన.. అందుకనుగుణంగా కొత్త ఆవిష్కరణలకు అలవాటుపడాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకనుగుణంగా ఉండాలన్నారు. నూతన ఆవిష్కరణలకు భారత్ హబ్‌గా రూపొందుతోందని పేర్కొన్నారు. దేశంలో సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోందని, రక్షణ రంగంలోనూ అనేక మార్పులు తీసుకొస్తోందని తెలిపారు.
యువతపైనే దేశ రక్షణ బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి
దేశ రక్షణ బాధ్యత యువతపైనే ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశ రక్షణలో హైదరాబాద్ దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తోందన్నారు.గచ్చిబౌలి స్టేడియంలో డీఆర్‌డీవో ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విజ్ఞాన్ వైభవ్’ ప్రదర్శనలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కలిసి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. దేశ రక్షణలో తెలంగాణ పాత్ర కీలకంగా ఉందన్నారు. బీడీఎల్, హెచ్‌ఏఎల్, మిధాని వంటి కీలక సంస్థలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సైన్స్ ప్రదర్శన వల్ల విద్యార్థులు, యువతకు దేశరక్షణ పట్ల అవగాహన కలుగుతుందన్నారు. ప్రస్తుతం యువత ఐటీ ఉద్యోగాలవైపే మొగ్గు చూపుతోందని.. సంప్రదాయ ఇంజినీరింగ్ విద్యపై కూడా విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సీఎం సూచించారు.