విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలి

విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన‌  సీఎం చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి 17వ తేదీ వరకూ పరీక్షలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారంతా ఉత్తమ ప్రతిభ కనబరచాలని చంద్రబాబు ఆకాక్షించారు.

విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు సజావుగా రాయాలని మంత్రి లోకేశ్‌ కోరారు. వేసవి దృష్ట్యా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. డీహైడ్రేషన్‌కు గురికాకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.