కృష్ణాజల్లాలో న్యాయబద్ధమైన వాటా కేటాయించండి

` గోదావరిలో తెలంగాణ నికర జలాల వాటా తేల్చాలి
` పాలమూరు`రంగారెడ్డి, సీతారామ, సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు ఇవ్వండి
` తెలంగాణ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందజేయండి
` కేటాయింపులకు మించి వాడుకుంటున్న ఏపీ
` తెలంగాణ నికర జలాలలకు తీరని అన్యాయం
` కృష్ణా బేసిన్‌ నుంచి నీటి తరలింపు అడ్డుకోవాలి
` బనకచర్లకు గోదావరి తరలింపుపై కేంద్రానికి ఫిర్యాదు
` గోదావరి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలి
` జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సీఎం రేవంత్‌ భేటీ
` పలు అంశాలపై వినతిపత్రం సమర్పణ
న్యూఢల్లీి(జనంసాక్షి):కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ రాష్టాన్రికి తీరని అన్యాయం జరుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా బేసిన్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అధిక నీటిని తీసుకుంటోందని ఆయన విమర్శించారు. నీటి తరలింపును అడ్డుకోవాలని తాము కేంద్రాన్ని కోరామని స్పష్టం చేశారు. నికర జలాలలను సైతం వాడుకోవడం దుర్మార్గమని అన్నారు. గోదావరి వరద జలాలను బనకచర్లకు తరలిస్తామని అంటున్నారంటూ సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌తో భేటీ అయిన సీఎం.. పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. అనంతరం ఆయన మంత్రి ఉత్తమ్‌తో కలిసి విూడియాతో మాట్లాడారు. సోమవారం న్యూఢల్లీిలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీ.ఆర్‌. పాటిల్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పలువురు తెలంగాణ ఎంపీలతోపాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్టాన్రికి సంబంధించిన ప్రాజెక్టులు, కృష్ణా, గోదావరి నదీ జలాల కేటాయింపు, వినియోగంపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే ఇటీవల జరిగిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ సంఘటనను సైతం మంత్రికి వీరు సోదాహరణగా వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ చేపడుతోన్న బనకచర్లపై తమ అభ్యంతరాన్ని కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌కు తెలియజేశామన్నారు. అయితే ఏపీ నుంచి ఈ బనకచర్ల ప్రాజెక్ట్‌పై తమకు ఎలాంటి డీపీఆర్‌ రాలేదని మంత్రి వివరించారని చెప్పారని తెలిపారు. అలాగే పాలమూరు, రంగారెడ్డి, సమ్మక్క – సారక్క ప్రాజెక్టులకు.. త్వరగా నీటి కేటాయింపులు చేయాలని మంత్రిని కోరినట్లు ఆయన వివరించారు. ఇక తమ ప్రాజెక్టులకు సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ క్లియరెన్స్‌ ఇంకా రాలేదని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కోరామని చెప్పారు. గోదావరి జలాలను అనుసంధానం చేసే అంశాన్ని కేంద్ర మంత్రికి వివరించామన్నారు. సమ్మక్క సారక్క, సీతారామ ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు ఇంత వరకు జరగలేదని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో తమ ప్రాజెక్టులకు ఎందుకు అభ్యంతరం చెబుతోందంటూ ఏపీపై సీఎం రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. తమ ప్రాజెక్టులకు, శాశ్వత కేటాయింపులు జరిగిన తర్వాతే నికర జలాలు ఉన్నాయనేది లెక్క తేలుతుందని ఆయన వివరించారు. తెలంగాణలో గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తయిన తర్వాత ఇతర ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. కృష్ణా బేసిన్‌లో ఏపీ సర్కార్‌ ఎక్కువ నీటిని తీసుకుంటోందని, అలా తీసుకోకుండా అడ్డుకోవాలని కేంద్రానికి చెప్పామన్నారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్లపై తమ అభ్యంతరం తెలపగా.. తప్పకుండా జోక్యం చేసుకుంటామని కేంద్రమంత్రి హావిూ ఇచ్చారన్నారు. ‘తెలంగాణలో గోదావరిపై ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులే జరగలేదు. మాకు కేటాయింపులు జరిగిన తర్వాతే ఏపీ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలి. కృష్ణా జలాల విషయంలో వచ్చిన సమస్యలే భవిష్యత్‌లో గోదావరి విషయంలో వస్తాయి. తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం చెప్పిన అభ్యంతరాలను ఉపసంహరించుకోవాలి. అప్పుడే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సీఎం తెలిపారు. ‘బనకచర్లపై ఏపీ సర్కార్‌ ఎలాంటి డీపీఆర్‌ ఇవ్వలేదని కేంద్రమంత్రి చెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేటాయింపుల పెంపుపైనా చర్చించాం. పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులకు కేంద్రాన్ని నిధులు అడిగాం. మొత్తం ఐదు ప్రాజెక్టులకు నిధులు కోరాం. ఉమ్మడి ప్రాజెక్టులపై టెలిమెట్రీలను త్వరగా ఏర్పాటు చేయాలని అడిగాం. టెలిమెట్రీల ఏర్పాటుకు అవసరమైతే ఏపీ వాటా భరిస్తామని చెప్పాం. మేడిగడ్డపై ఎన్డీఎస్‌ఏ రిపోర్టు త్వరగా ఇవ్వాలని కోరాం. అలాగైతే మేం చర్యలు చేపడతామని చెప్పాం‘ అని ఉత్తమ్‌ విూడియాకు వివరించారు. నాగార్జునసాగర్‌, శ్రీశైలం నుంచి ఆంధప్రదేశ్‌ తీసుకు వెళ్తున్న అధిక జలాలను ఆపాలని కేంద్రమంత్రి సీఆర్‌ పాటిల్‌ను తాము కోరామన్నారు. కేంద్రం అత్యవసరంగా జోక్యం చేసుకొని ఈ అన్యాయాన్ని ఆపాలని ఆయనకు విజ్జప్తి చేశామన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. గోదావరిపై ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల లింక్‌ ప్రాజెక్టుకు తాము అభ్యంతరం చేప్పామని ఆయన స్పష్టం చేశారు. అయితే దీనిపై ఏపీ నుంచి ఎటువంటి నివేదిక రాలేదని.. ఈ అంశంలో తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రి హావిూ ఇచ్చారని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. కృష్ణా ట్రిబ్యునల్‌ ద్వారా తెలంగాణకు అధిక నీరు ఇచ్చేలా సహకరించాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన చెప్పారు. పాలమూరు రంగారెడ్డి, సమ్మక్క సారక్క, సీతారామ సాగర్‌ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులతో పాటు నిధులు సైతం ఇవ్వాలని తాము అడిగాని వివరించారు. అలాగే కృష్ణా నదిలో శ్రీశైలం, నాగార్జున సాగర్‌ సహా ఇతర ప్రాజెక్టులలో టెలీ మెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. అవసరమైతే.. టెలీమెట్రీల కోసం తెలంగాణ, ఆంధ్రా వాటా ఖర్చు సైతం తామే భరిస్తామని కేంద్రానికి స్పష్టం చేశామని వివరించారు. తమ ఈ ప్రతిపాదనపై కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌ సానుకూలంగా స్పందించారన్నారు. మరోవైపు ఇండియా ఇన్‌ఫ్రాస్టక్చర్ర్‌ ఫండ్‌ నుంచి తెలంగాణకు 50 ఏళ్ల పాటు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణం ఇవ్వాలని కోరామన్నారు. అలాగే మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్టులపై నేషనల్‌ డ్యాం సేప్టీ అథారిటీ నుంచి త్వరగా నివేదిక అందేలా ఆదేశించాలని విజ్జప్తి చేసినట్లు తెలిపారు. అయితే తెలంగాణ జల వనరుల విషయంలో కేంద్రం వద్ద సీఎం రేవంత్‌ రెడ్డి, తాను.. బలమైన వాదనలు వినిపించామని తెలిపారు. కృష్ణా జలాల వివాదంలో రోజు వారీగా కేంద్రం జోక్యం చేసుకుంటుందని హావిూ ఇచ్చిందని చెప్పారు. అదే విధంగా దీర్ఘకాలికంగా బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని కోరాన్నారు. తుమ్మడిహట్టి సవిూపంలో గతంలో కాంగ్రెస్‌ ప్రతిపాదించి పనులు మొదలు పెట్టనున్నామ న్నారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో కూడా కేంద్రంతో చర్చించామన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి భూసేకరణ విషయంలో సహకరించాలని కేంద్రాన్ని కోరినట్లు వివరించారు.