ఘనంగా పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు
జహీరాబాద్ ఆగస్టు 8 (జనంసాక్షి) జహీరాబాద్ పట్టణం లోని రాంనగర్ ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో ముదిరాజ్ సంఘం కార్యాలయ ఆవరణలో పండగ సాయన్న జయంతిని బహుజన సమాజ్ పార్టీ, ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఆశాజ్యోతి బడుగు బలహీన వర్గాల వీరుడు సూర్యుడు పండగ సాయన్న 150 వ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు అన్నారు..ఆనాడు గ్రామంలో పెత్తందారులు స్వైర విహారం చేసేవారు దొరల ఆధిపత్యానికి అడ్డు లేకుండా ఉండేది భూస్వాముల దగ్గర వంగి వంగి నడవాల్సి వచ్చేది ఎదురు తిరిగి మాట్లాడే వారు కారు అన్నారు. ఈ పరిస్థితిలను చూసి పండగ సాయన్న ఉద్యమాలు చేశారన్నారు. ధనవంతులను భూస్వామిని కొట్టి పేదలకు పెట్టమన్న ఒక సూత్రాన్ని ద్వారానే అధిపతి శక్తులపై యుద్ధం చేయటం పండగ సైన్ అభిమతం ఉన్నది యుద్ధం చేసే క్రమంలో ప్రజలను చైతన్య పరచాలి. పెద్ద నీతి అవగతం చేసుకొని సాయన్న ప్రజాక్షేత్రంలో ఆయుధం పట్టుకున్నాడు అన్నారు. సాయన్న పరిణతికి చెందిన బహుజన వీరుడు జ్ఞానపదుడు.చెలాయిస్తున్నాయో గుర్తించి ఎదుర్కొనడానికి సిద్ధమయ్యాడు అన్నారు. ఈ కార్యక్రమంలో.ముదిరాజ్ రాష్ట్ర నాయకులు కొండాపురం నరసింహులు, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్దు రావణ్ . గోపాల్ ముదిరాజ్ (అడ్వకేట్) రాష్ట్ర నాయకులు ముదిరాజ్ సంఘం జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు దత్తాత్రి ముదిరాజ్ . ఉపాధ్యక్షులు ప్రభాకర్ ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి మహేష్ ముదిరాజ్ ఆకుల విజయ్ విలాస్ విష్ణు చంటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.