ఘనంగా పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం

శామీర్ పేట్, జనం సాక్షి :
తూముకుంట మున్సిపాలిటీ పరిధి లోని దేవరయంజాల్ జిల్లా పరిషత్ పాఠశాల పదో తరగతి వరకు చదివిన 1996-1997 సంవత్సరానికి సంబంధించిన పూర్వ విద్యార్థులు 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం రోజు దేవరయంజాల్ జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 60 మంది విద్యార్థులు పాల్గొని విద్యాబుద్ధులు నేర్పించిన పూర్వపు, ఉపాధ్యాయులైన మాజీ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు వెంకట్ రాంరెడ్డి,తిరుమల చారి,ప్రస్తుత యాప్రాల్ జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాపిరెడ్డి,
ఉపాధ్యాయులు భీమయ్య,రిటైర్డ్ ఉపాధ్యాయులు వసంత,అభిమన్యు,విజయ్ కుమార్ గార్లను శాలువలతో సత్కరించి జ్ఞాపికలు పూర్వ విద్యార్థులు అంద జేశారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు,పూర్వ విద్యార్థులు వారి గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆనందంగా గడిపారు.
28 ఎస్పీటీ -1: సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు