చారిత్రాత్మక నిర్ణయం వెలువడుతుంది : శ్రీధర్‌బాబు

కరీంనగర్‌: తెలంగాణపై ఈ నెల 28న ఢిల్లీలో జరగనున్న అఖిలపక్షభేటీలో చారిత్రాత్మక నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలియజేశారు. అఖిలపక్ష సమావేశానికి పార్టీల నుంచి ఒక్కరినే పిలవాలని ఆయన కోరారు. ఓ కార్యాక్రమంలో పాల్గొనేందుకు మంత్రి కరీంనగర్‌ వచ్చారు. ఆధార్‌ కార్డుల  జారీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.