చిత్రాలేఅవుట్ లో పేదలకు బియ్యం మరియు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం,
మట్టి గణపతులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన ఉప్పల శ్రీనివాస్ గుప్త
హైదరాబాద్ లోని చిత్రాలేఅవుట్ లో SRR చారిటబుల్ ట్రస్ట్ & సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం & చిత్రాలేఅవుట్ ఎల్బీనగర్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు నెలలో ఈ పై సంఘంలో ఉన్న సీనియర్ సిటీజన్ల పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా సీనియర్ సిటిజన్ సంక్షేమ భవనంలో ఏర్పాటు చేసిన పేదలకు బియ్యం మరియు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త
ఈ కార్యక్రమంలో ఎస్ వి రామారావు, దైవజ్ఞ శర్మ, మురళీ మనోహర్ పుట్టి, ఎం అంజిరెడ్డి, ఆర్ఎల్ నరసింహారెడ్డి, ఎస్ రామచంద్రరావు, ఎం నాగేంద్రయ్య, బి వీరయ్య, శ్రీరామ్ రెడ్డి, మధుసూదన్ రావు, లింగారెడ్డి, దయాకర్ రెడ్డి, రంగారెడ్డి, రామకృష్ణ, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.