చెరుకు క్రషర్‌కు నిప్పు

విజయనగరం, జూలై 30 : కొత్తలి వారి కళ్లాల్లో చెరుకు క్రషర్‌కు అదే కళ్లానికి చెందిన కొత్తలి నారం నాయుడు నిప్పు పెట్టాడు. దీంతో రూ. 3లక్షల విలువైన క్రషర్‌ మెటీరియల్‌ కాలిపోయింది. జామి కొత్తలి వారి కళ్లాల్లో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం గ్రామానికి చెందిన నామా రామకృష్ణ చెరకు క్రషర్‌ను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సీజన్‌ ముగియడంతో కొత్తలి రాధాకృష్ణ కళ్లంలో క్రషర్‌ సామాన్లు అన్నీ భద్రపరిచారు. కొత్తలి నారం నాయుడు క్రషర్‌ సామాన్లు ఉన్న శాలకు తాగిన మైకంలో నిప్పు పెట్టి, అనంతరం పక్కనే నిద్రపోయినట్లు కొత్తలి రాధాకృష్ణ జామి పోలీసులకు ఫిర్యాదు చేశారు.