చేపల మార్కెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి

హైదరాబాద్‌: గుర్తించిన ప్రభుత్వ స్థలాల్లో చేపల మార్కెట్లు ఏర్పాటు చేయాలని మత్స్యకారులు, మత్య్స కార్మికుల సంఘం డిమాండ్‌ చేసింది. రైతు బజార్లలో చేపల స్టాల్స్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో కోరారు. మత్స్యమిత్ర గ్రూపు సభ్యురాలికి లక్ష రూపాయల యాబై శాతం సబ్సిడీతో పావలా వడ్డీ రుణాలివ్వాలని నగరంలో ఉన్న సొసైటీలకు ఆఫ్‌కాఫ్‌లో సభ్యత్వం కల్పించాలని వారు కోరారు. అక్వేరియంలో ప్రత్యేక శిక్షణ పొందిన మత్స్యకార మహిళలకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు. మత్స్యకారులు, కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని సదస్సులో పాల్గొన్న అధికారులు హామీ ఇచ్చారు.